నీకేమీ కాదమ్మా నేను ఉన్నాను. బిడ్డ కోసం తల్లి సాహసం


 నీకేమీ కాదమ్మా నేను ఉన్నాను. బిడ్డ కోసం తల్లి సాహసం. 

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో  వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం. 



అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు ఘాట్లో లో సౌండ్ సిస్టం  లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడిన ఘటన అందర్నీ కలచి వేసింది. అయితే  తల్లి తన బిడ్డను రక్షించు కొనేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి  సాహసమే చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న తన బిడ్డకు  ఏమి కాకుండా తన కౌగిలిలో వదలకుండా తనకేమైనా పరవాలేదు కానీ తన బిడ్డకు ఏమీ కాకూడదు దాని కౌగిలిలో వ్యాన్ తన మీద ఉన్న తన ప్రాణానికి  లెక్క కట్టకుండా లెక్కచేయకుండా తన బిడ్డని కాపాడాలని సాహసమే చేసింది. పైన ఎంత ప్రమాదం పొంచి ఉన్న తన ప్రాణం కన్నా బిడ్డ ప్రాణం ముఖ్యమని  పాపని తన కౌగిలిలో ఒడిసి పట్టుకొని సాహసమే చేసింది. దీంతో వారిద్దరూ సల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే బిడ్డకు ఏమి కాకపోవడంతో ఘటన చూసిన పలువురు తల్లి చేసిన సాహసాన్ని ప్రశంసించారు.