మంగళవారం ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా పూర్తి చేశామని జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలకు పేరుపేరునా జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించిన బందోబస్తు విధులలో పాల్గొన్న హోమ్ గార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు,అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమా మహేశ్వర రావు, డి గంగాధరం(సెబ్),ఇతర కేంద్ర బలగాలు, ఎన్ఎస్ఎస్, ఎన్.సిసి,ఎక్స్ ఆర్మీ తో పాటు ఇతర జిల్లాలకు చెందిన అదనపు బలగాలను జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక అభినందించారు.
మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు జూన్ 4వ తేదీన జరిగిన కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేశామని,జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాల చర్యలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.