భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావుకి అభినందనలు తెలిపిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.



భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందచేసి దుషాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా మీసేవ యూనియన్ సెక్రటరీ నాగు మాట్లాడారు గంటాను రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు పోటీచేయ్యగా రెండవ అధ్యధిక మెజారీటీతో గెలుపొందటం తో భీమిలి ప్రజలకు మీ పై అభిమానం గతంలో మీరు చేసిన అభివృద్ధి పై నమ్మకంతో అంత మెజారిటీతో గెలిపించారని అన్నారు. మీరు రెండో హేట్రిక్ విజయం నమోదు చేసి 25సంవత్సరాలు రాజకీయం పూర్తి చేసుకున్నారని ఓటమి లేని నేతగా విజయ డంకా మొగిస్తున్నారని కొనియాడారు. అనంతరం మీసేవ ఆపరేటర్లు పడ్డ ఇబ్బందులు గంటాకి వివరిస్తూ మీసేవ ఆపరేటర్ల సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. గంటా మీసేవ ఆపరేటర్ల సమస్యల పై మాట్లాడుతూ త్వరలో పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తానని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో డి. వి శ్రీనివాస్, భీమేష్, సాయిరాం, శ్రీహరి, జగదీశ్, మూర్తి, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.