తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్




 గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి. అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలేకపోయింది." అని పవన్ విమర్శించారు.