ఎన్ఏడి జంక్షన్ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు



విశాఖ ఎన్ఏడి జంక్షన్ వద్ద పోలీసులు ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన కిరణ్ కుమార్ చెన్నప్ప, శివరాజ్ గజేంద్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఆరు కిలోల గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పక్క సమాచారం అందింది. ఈ మేరకు వారు ఎన్ఏడి జంక్షన్ వద్ద వారిని పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ చక్రధర్ రావు దర్యాప్తు చేస్తున్నారు.