స్పీకర్ పదవీ స్థానానికి గౌరవం పెరిగేలా పని చేస్తా
బాధ్యతల చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారన్నారు ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అనంతరం అయ్యన్నపాత్రుడు శనివారం తొలిసారిగా విశాఖ పట్టణం విచ్చేశారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పైమేరకు స్పందించారు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు విశాఖపట్టణం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.మయూర్ అశోక్,పోలీస్ కమిషనర్ డా.ఎ. రవిశంకర్,అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి,ఎస్పీ మరళీకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్,పోలీసు అధికారులు విశాల్ గున్ని,మేకా సత్తిబాబు,స్థానిక నేతలు,ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నేతలు,అధికారులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.