నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరుసోమల గ్రామంలో శ్రీ విష్ణుకంటి క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహ స్వామివారి 14వ వార్షికోత్సవం సందర్భంగా నేడు 01-06-2024వ తేదీ శనివారం నాడు శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ ఆదిలక్ష్మి సిద్ధలక్ష్మి సమేత శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రామ్మోహన్ స్వామివారి ఆహ్వానం మేరకు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు.
ముందుగా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ఆయనను వేద పండితులు పూర్ణ కలశంతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో బత్యాల గారిని స్వామివారి దుశ్యాలువా వేసి పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దాము, జగపతి వర్మ, సింగనమల నాగార్జున, హరి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.