రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.