గిడ్డి ఈశ్వరి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొయ్యూరు పాడేరు టిడిపి పార్టీ నేతలు
పాడేరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గిడ్డీస్వరి పుట్టినరోజు వేడుకలు టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి (క్లస్టర్ ఇంచార్జ్) తోట దొరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ పెద్దలు మాట్లాడుతూ... అన్నపూర్ణ దేవి గిడ్డి ఈశ్వరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. అలాగే పాడేరు నియోజకవర్గం మీ చేతుల మీదుగా అభివృద్ధి చెందాలని మండల నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు గ్రామస్తులు అలాగే పాడేరు పార్టీ నేతలు తన ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.