మనస్థాపంతో యువతీ ఆత్మహత్య

నా అనే వాళ్ళు అందరు దూరం కావటం తో మనస్థాపం తో యువతి ఆత్మహత్య చేసుకుంది.



 కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయితీ బొడ్డు మామిడిలంక కు చెందిన కుండ్ల రాధమ్మ (19) అనే యువతి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద చాయాలు నెలకొన్నాయి. రాధమ్మ చిన్నతనం లోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత సోదరుడు మృతి కూడా చెందాడు. తనను ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా చూసుకునే నానమ్మ ఇటీవలె చనిపోయింది. ఈ నేపథ్యంలో మంప ఎస్సై లోకేష్ కుమార్ అందించిన సమాచారం మేరకు నా అనుకున్న వాళ్లు నాకంటూ ఎవరూ లేరు అని మనస్తాపానికి గురైన రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిందని తెలిపారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు కి ఇలా జరగడం చాలా బాధాకరం, అని స్థానికులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మoప ఎస్సై లోకేష్ కుమార్ దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.