టిడిపి జనసేన బిజెపి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి 127వ జయంతి వేడుకలు...

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గ, చింతపల్లిలో  అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు పురస్కరించుకుని టిడిపి జనసేన బిజెపి పార్టీ నాయకులు చింతపల్లి మూడు రోడ్ల జాంక్షన్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి అక్కడ నుండి ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లి అక్కడ ఎమ్మార్వో రామ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించడం జరిగింది.


ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు వంతల బుజ్జి బాబు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి పట్ల పోరాడిన యోధుడు మన్యం వీరుడు ఆగి పిడుగు అల్లూరి ఇతను 1917లో విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చి కేడిపేట మన్యంలో అడుగు పెట్టీ1922 ఆగష్టు 22 చింతపల్లి పోలీస్ స్టేషన్లో దాడి చేసి 23 న కేడిపేట పోలీస్ స్టేషన్ పై 24 న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి లో ఈ మూడు స్టేషన్లపై దాడి తరువాత భారీగా ఆయుధాలను సేకరించుకుని విప్లవం ప్రారంభించాడు.


మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి గిరిజనులు బానిస సంకెళ్ళ నుంచి విముక్తి పొంది తమ స్వచ్చ కోసం బ్రతకాలని బ్రిటిష్ తెలదొరలపై ఉద్యమం చేసి తరిమి కొట్టిన మహా విప్లవ నేత అల్లూరి సీతారామరాజు ఈ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మనమందరం సమర్థవంతమైన పాలన కోసం పోరాటం చేసి మా మన్య ప్రాంతానికీ అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు బుజ్జి బాబు అన్నారు.



ఈ కార్యక్రమానికి కిమ్ముడూ క్రిష్ణ మూర్తి జనసేన మండల ఉపఅధ్యక్షులు శెట్టి స్వామి ఐటీ అండ్ సోషల్ మీడియా ఇంచార్జీ బూడిద రాజు, వంతల సంతోష్ వేమల పూడి చిన్న, కొర్ర సతి బాబు టీడీపి పార్టీ నాయకులు నాగ భూషణ్ అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉప అధ్యక్షులు మండల ఉప అధ్యక్షులు లక్ష్మణ్ ఉన్న మధు రామ కృష్ణ మర్రి మంగ్లు పాల్గొన్నారు