అనకాపల్లి జిల్లా
ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్
జిల్లా పోలీసు కార్యలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన 22 ఫిర్యాదులలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు మరియు చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు నేరుగా ఫిర్యదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.