శ్రీకాకుళం జిల్లా
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఐపిఎస్ 75 లక్షల చెక్కును పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జిల్లా పోలీసు శాఖకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి గన్నయ్య యొక్క నామిని అయిన గన్నయ సతీమణి బి.వరహలమ్మ కు చెక్కును అందజేయడం జరిగినది. చనిపోయిన వ్యక్తి పేరున స్టేట్ బ్యాంకు కొర్లకోట శాఖలో ఎకౌంటు ఉంది పోలీస్ శాలరీ ప్యాకేజీ లో ఉన్నందున, పర్సనల్ ప్రమాద భీమా కింద 75 లక్షలు నామిని పేరున రావడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్పీ జి ఆర్ రాధిక మాట్లాడుతూ జిల్లాలో గల పోలీసు అధికారులు, సిబ్బంది పోలీస్ శాలరీ ప్యాకేజీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్షణమే పోలీసులు అందరూ తమ శాలరీ అకౌంట్స్ ను స్టేట్ బ్యాంక్ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద స్టేట్ బ్యాంకు శాఖలో మార్చుకోవాలన్నారు.నామిని యొక్క పూర్తి వివరాలు బ్యాంకులో సమర్పించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి జి ప్రేమ్ కాజల్,స్టేట్ బ్యాంకు స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ కామ్రేడ్ కే సి హెచ్ వెంకట రమణ,పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ కె రాధాకృష్ణ ,బ్యాంక్ చీఫ్ మేనేజర్ గోపీనాథ్ , కొర్లకోట స్టేట్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ బి.సాయిరాం, బ్యాంకు ఉద్యోగులు బి.దాలి నాయుడు,శ్రీనివాస్, క్రాంతి ,సునీల్ పాల్గొన్నారు.