దాడిచేసిన కేసులో నకిలీ విలేఖరి అరెస్ట్....

గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవనిగడ్డ డిపో RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, దాడిచేసిన కేసులో నకిలీ విలేఖరి అరెస్ట్.



మోపిదేవి మండలం, ఉత్తర చిరువోలు గ్రామానికి చెందిన సిరివెళ్ళ రాకేష్ అనే అతను అవనిగడ్డ RTC డిపో లో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు ది.28.06.2024 వ తేదీన సాయంత్రం అవనిగడ్డ నుండి గుడివాడ వస్తుండగా సుమారు 6.25 గంటల సమయంలో బస్ గుడివాడ అతిది హోటల్ దగ్గరికి వచ్చేసరికి, తన బస్ ముందుకు వెళ్లకుండా గుడివాడ కి చెందిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ అనే అతను తన కారుని రోడ్డుకి అడ్డం పెట్టినట్లు, కారు పోనివ్వమని RTC డ్రైవర్ హారన్ కొట్టగా, కారు తీయకపోయే సరికి బస్ డ్రైవర్ మళ్ళీ హారన్ కొట్టగా, కారు డ్రైవర్ బాగా మధ్యం సేవించి వుండి RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, చేతుల్తో దాడి చేసి విధులకు ఆటంక పరిచినట్లు, తదుపరి మళ్ళీ బస్ తో సహా బస్ స్టాండ్ కి వెళ్ళిన RTC డ్రైవర్ ని ముందుగా అతిది హోటల్ దగ్గర దాడిచేసిన వ్యక్తి మరొక వ్యక్తి వ్యక్తితో కలసి దుర్భాషలాడి, దాడి చేసినట్లు, RTC డ్రైవర్ పై దాడిచేసిన సమయంలో ఇద్దరు వ్యక్తులలో రెండో వ్యక్తి తాను విలేఖరి అని చెప్పినట్లుగా, RTC డ్రైవర్ సిరివెళ్ళ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిన తదుపరి, గుడివాడ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్  M.నాగ దుర్గారావు  పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ పి.నాగరాజు RTC డ్రైవర్ ని బస్ ని దుర్భాషలాడి, దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను బేతవోలు కు చెందిన పంచకర్ల శ్రీనివాస్ @ వాసు, ముభారక్ సెంటర్ కి చెందిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ గా గుర్తించడమైనది. విలేఖరి అని చెప్పిన పంచకర్ల శ్రీనివాస్ @ వాసు ను క్షుణ్ణంగా విచారించగా అతనికి ఏవిధమైన దినపత్రికలో గానీ, ఎలక్టానిక్ మీడియాలో అక్రిడిటేషన్ లేకుండా విలేఖరి అని చెప్పుకుని చెలామణి అవుతున్నట్లుగా నిర్ధారణ అయింది. సదరు పంచకర్ల శ్రీనివాస్ @ వాసు ఈరోజు అనగా ది.30.06.2024 వ తేదీ ఉదయం RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, తన విధులకు ఆటంకపరిచి, దాడిచేసిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం  జుడీషియల్ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్, గుడివాడ వారి కోర్టుకు పంపడమైనది. ఇదే కేసులో మరొక ముద్దాయి అయిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ పరారీలో వున్నాడు అతని గురించి పోలీస్ టీం పంపడం జరిగింది.