విశాఖపట్నం
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదని విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ అన్నారు. సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరూ అధికారులు,సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి,డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు 100 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా కొనసాగుతుందన్నారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందన్నారు పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది వాటిని అరికడతాం అన్నారు. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయిందన్నారు ప్రజలకు గానీ సిబ్బందికి గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా 7995095799 ఫోన్ నెంబర్ కు వీడియో ఆడియో ఫొటో మెసేజ్ ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు సాధ్య మైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా మన్నారు ట్రాఫిక్ సమస్యలు రోడ్డు ప్రమాదలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తె మర్యాద ఇవ్వాలన్నారు. పబ్లిక్ తో ఎవరు తప్పు గా మాట్లాడకూడదు అని తెలిపారు. చివరిగా వైజాగ్ లో పని చెయ్యడానికి అవకాశం కల్పించిన ముఖ్య మంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు.