మన రక్తం రక్తదానం మరొకరి ప్రాణదానం : రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ,రక్త బంధ ఆర్గనైజేషన్ కన్నా వెంకటేష్
అనంతపురం: అనంతపురం కి చెందిన హరి, హార్ట్ ఆపరేషన్ కొరకు అనంతపురం సవేరా హాస్పిటల్ అడ్మిషన్ అయినారు. వాళ్లకి అత్యవసరంగా B -ve బ్లడ్ కావాలని వైద్యులు తెలుపగా సోషల్ మీడియా ద్వారా రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరియు రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు రామలింగారెడ్డి కి తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి శ్రీనిధి బ్లడ్ బ్యాంక్ వచ్చి తన B -ve 21 వ సారి రక్తదానం చేయడం జరిగింది.
ఈ ఒక్క కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మరియు రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు మరియు హరి కుటుంబ సభ్యులు పలుగురు రామలింగారెడ్డి నీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ ఈ రోజున ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. ఇప్పటివరకు 21సార్లు రక్తదానం చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రక్తదానం చేస్తామని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది.