అల్లూరి జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు

అల్లూరి జిల్లా

 ఇసుక ట్రాక్టర్లు పై వసూళ్లకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు.....?



 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో దేవుడు వరమిచ్చిన పూజారి అనుమతించలేదన్న చందంగా ఉంది కొయ్యూరు మండలంలో కొంతమంది అధికారులు. పనితీరు. ఇసుక "ఫ్రీ" ఇటువంటి రుసుము కట్టనవసరం లేదు అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికి. కొంతమంది మండల అధికారులు ఇప్పటికి ప్రభుత్వానికి. "చలానా " కట్టాలంటూ డబ్బులు వసూలు చేయడం శోచనీయం. మంగళవారం రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ రాజు అనే టాక్టర్ యజమాని ఇసుక తరలిస్తుండగా. ఫైన్ కట్టాలంటూ అతని వద్దనుండి 5000 రూపాయలు రెవెన్యూ అధికారులు అక్రమంగా వసూలు చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అలాగే గత నెల రెవెన్యూ అధికారి రాజన్న దొర కొంతమంది సిబ్బంది సహాయంతో దాడులు నిర్వహించే ఆడాకుల గ్రామానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం పరచుకునే 20వేల రూపాయలు గమనార్హo. ఒకవైపు ప్రభుత్వo ఇసుక ఫ్రీ సరఫరా చేసుకోవచ్చును. ఎటువంటి రుసుము కట్టునవసరం లేదు. అంటూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో పర్సంటేజ్ అలవాటు పడ్డ కొంతమంది అధికారులు ఇప్పటికీ అదే బాటలో ప్రయాణించటం శోచనీయం. ఈ విషయమై సంబంధిత. ఉన్నత అధికారులకు. ఫిర్యాదు చేసినట్లు బాధితులు వివరిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులను కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.