2024-25 విధ్య సంవత్సరానికి సంబంధించి నూతనంగా, 05 మేజర్, మరియు 04 మైనర్ సబ్జెక్టులకు ప్రవేశపెట్టినట్లు, వీటికి అర్హులైన విద్యార్థి ని నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు. కోరుతున్నట్లు మండలంలోని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బి. కృష్ణ శుక్రవారం తెలిపారు. ఇందులో మేజర్ విభాగంలో మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఎకనామిక్స్, బీకాం. కంప్యూటర్ ఉన్నట్లు, అలాగే మైనర్ విభాగంలో కెమిస్ట్రీ, బోటనీ, పాలిటిక్స్, మార్కెటింగ్, కోర్సులు ఉన్నట్లు ప్రిన్సిపల్ వివరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఈ గ్రూపులకు ఆన్లైన్ లో ఈనెల 20 తేదీల్లోపు దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నారు. కళాశాలకు అతి దగ్గరలో ఉచిత హాస్టల్ సదుపాయం ఉందని తెలియపరిచారు. మరిన్ని వివరాల కొరకు 9704080103, 9989465410 సెల్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ డా.బి. కృష్ణ వివరించారు.