అల్లూరి జిల్లా లో మావోయిస్టులకు చెందిన భారీ డంపు స్వాధీనం

 అల్లూరి జిల్లా



 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధరాల పంచాయతీ కన్నవరం అటవీ ప్రాంత సమీపంలో మావోయిస్టు సంబంధించి పేలుడు పదార్థాలతో కూడిన డంపును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

ఈడంపులో దొరికిన వస్తువులు కార్డెక్స్ వైర్ 2 కేజీలు,నలుపు రంగు ఎలక్ట్రికల్ వైరు కట్ట ఒకటి,ఎరుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్ 1, ప్లగ్గులు ఐదు స్విచ్లు రెండు కటింగ్ ప్లేయర్ ఒకటి చిన్న బ్యాటరీ మరియు నిషేధిత సిపిఎం సాహిత్యం కలిగిన పుస్తకాలు దొరికాయి. ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులారా అమాయకులైన గిరిజనులకు బాంబులు తయారు చేయడం పోలీసులపై దాడులు చేయడం నేర్పటం కాదు మీరు అభివృద్ధి లేని గ్రామంలోకి వచ్చి ఆ అమాయకు లైన గిరిజనతో ఉండి వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమ కోసం మీరు పాటుపడాలి గాని ఇలా బాంబులు తయారు చేయడం దాడులు చేయడం నేర్పించడం సమంజసం కాదని చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులకు అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేసారు.