అల్లూరి చిత్రపటాన్ని పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఐపిఎస్.

 శ్రీకాకుళం జిల్లా




సమసమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపిఎస్ కొనియాడారు.




గురువారం అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపీఎస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనలు, పేదవారుకు అండగా నిలిచి విప్లవ యోధులుగా తయారుచేసి 27 ఏళ్ల వయసులో కొయ్యూరు మండలంలో మే 7,1924న తెల్లదొర్లకు బందీ కాబడి వీర మరణం పొందిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఏవో సీ.హెచ్ గోపీనాథ్,సిఐలు దేవుల్లు, శ్రీను,ఆర్ఐలు సురేష్, నర్సింగరావు,ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.