రోజు రోజుకు చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు అరికట్టాలి:-ప్రజా సంఘాలు డిమాండ్
మహిళలను దేవతలుగా పూజించే రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి.
ఈరోజు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తు ప్రజాసంఘాల (ఐద్వా,SFI,DYFI,KVPS,RVS) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయిఉదయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా జిల్లా అధ్యక్షులు కె.అరుణ, RVS నాయకురాలు జయమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ భాష , కెవిపిఎస్ జిల్లా నాయకులు కృష్ణ, RVS నగర కార్యదర్శులు శేషాద్రి , శ్రీనివాసులు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోజురోజుకీ చిన్నారులపై, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని వారు విమర్శించారు.
ఈ దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కఠినమైన నిర్భయ, దిశ చట్టాలు అమలులో ఉన్న వాటిని ఆచరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈ దాడులు పెద్ద ఎత్తున మహిళలపై జరుగుతున్నాయని వారు విమర్శించారు. మన రాష్ట్రంలో నంద్యాల జిల్లా విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లాల్లో చిన్నారులపై జరిగిన లైంగిక దాడులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ముచ్చుమరిలో చిన్నారి వాసంతి మృతదేహం నేటికీ కూడా లభ్యం కాకపోవడం చాలా బాధాకరం. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో రోజురోజుకి లైంగిక అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు దుండగులపై చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం మీ వారు వాపోయారు. ఈ దాడులు దౌర్జన్యాలు జరగడానికి ముఖ్య కారణం మద్యం, డ్రగ్స్ కారణం మద్యం మత్తులో మహిళలపై చిన్నారులపై లైంగికంగా దాడులు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో మహిళలకు గౌరవం ఇస్తున్నామని చెప్పడమే తప్ప ప్రత్యక్షంగా ఎటువంటి గౌరవం మహిళలకు లభించడం లేదు. కాబట్టి దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రభుత్వాలు తక్షణమే మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, డ్రగ్స్ మధ్యమును నివారించి మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర నాయకురాలు పద్మ, సుజాత, శ్యామల, ఎస్ఎఫ్ఐ నాయకులు అమర్, ఆర్యన్, అబ్బు , యోగి, ఖాజా, ఆదిత్య, హేమంత్, కళ్యాణ్, డివైఎఫ్ఐ నాయకులు గౌతం, మహేష్, భరత్, రజక సంఘం నాయకులు ఎల్లయ్య, చందు, రాముడు, పుష్ప కెవిపిఎస్ నాయకులు గోపాల్, రైతు సంఘం నాయకులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.