ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్
బిజెపి వ్యతిరేక పోరాటాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లే బాధ్యత సిపిఎందే
జిల్లా విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులకు సూచన.
ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక కాఫీ హౌస్ లో బుధవారం నిర్వహించిన అల్లూరి జిల్లా సిపిఎం విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తీరు ఓట్ల గణాంకాల పై సమీక్షించి పార్టీ శ్రేణులకు విశధీకరించి భవిష్యత్తు కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. సిపిఎం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల తీరుపై వివరించారు. ఆదివాసీలను పీడించే సమస్యలపై ప్రజా ఉద్యమాలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో నిర్వహించిన అనేక ప్రజా సమస్యల పోరాటాలను కొనసాగించి జీవో నెంబర్ త్రీ ని పునరుద్ధరించాలని, భాష వాలంటీర్లను రెగ్యులర్ చేయాలని, ఏకలవ్య పాఠశాలల్లో స్థానికులను ఉపాధ్యాయులుగా నియమించాలని తదితర గిరిజన సమస్యలపై స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవస్థీకృత సంక్షోభంలో ఉందన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు ఇలాంటి సంక్షోభాన్ని అధిగమించడానికి ఆందోళనలకు పూనుకునే అవకాశం ఉందని రాబోయే కాలం ప్రజా ఉద్యమాల కాలమని వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే ప్రభుత్వాలను కూల్చే ఉద్యమాలు సాగే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
బిజెపి మతోన్మాద వైఖరి పై రాష్ట్రంలో టిడిపి వైసిపి జనసేన మాట్లాడడం లేదని, గత ఐదేళ్లలో బిజెపికి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో కేంద్రం చెప్పిందల్లా చేసిన వైసిపి ప్రభుత్వం ఎన్నికల్లో పూర్తిగా అడుగంటి పోయిందని అన్నారు. అయినా కూడా జగన్ పాఠాలు నేర్చుకోవడం లేదని మళ్లీ మోడీనే బలపరుస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని స్వతంత్రంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సిపిఎం దేనని ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. ఆర్ఎస్ఎస్ ఆదర్శవంతంగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఇదేం మత సామరస్యమని, లౌకికవాదం ఇంకెక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశమే లేని బిజెపికి పల్లకి మోస్తూ ఆ పార్టీ విస్తరించడానికి టిడిపి జనసేన అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న బిజెపికి రాష్ట్రంలో టిడిపి మద్దతుగా నిలిచిందని, అల్లూరి జిల్లాలో కూడా ప్రజలు బిజెపిని వ్యతిరేకించారని, ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో స్వతంత్ర కార్యక్రమాలను విస్తరించాలని సొంత కృషితో స్థానికంగా బలోపేతం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బిజెపిని పూర్తిగా బలహీన పర్చేందుకు ఐక్య పోరాటాలు సాగించాలని, ఇందుకు విశాల వేదికలపై లౌకిక ప్రజాశక్తులను సమీకరించాలని ఆయన సూచించారు.
*సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నరస* మాట్లాడుతూ, గత ఎన్నికల్లో అల్లూరి జిల్లా వ్యాప్తంగా సిపిఎం పట్ల ప్రజాభిమానం వెల్లువెత్తిందని, అరకులో అన్ని పార్టీలను అధిగమించి మెజార్టీ సాధించడం గొప్ప గర్వ కారణమని, రానున్న కాలంలో ప్రజాబలం మరింత కూడగట్టుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో సిపిఎం అత్యధిక స్థానాలను గెలుచుకొని ప్రజాక్షేత్రంలో ధీటుగా నిలిచేందుకు పార్టీ శ్రేణులు నిరంతర కృషి జరపాలని ప్రజా సమస్యలపై దృఢంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
*రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక నాదం* గారు మాట్లాడుతూ ఐ.టి.డి. ఏ పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేయడం మంచిది దాని, పాలక వర్గ సభ్యులు ఆమోదం లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం రాజ్యంగ విరుద్ధం మన్నారు.
జిల్లా సమావేశానికి అధ్యక్ష వర్గంగా డి గంగా రాజు, బి.చిన్నయ పడల్, ఎస్. హైమ వతి, తోపాటు బి.సన్నీ బాబు, కె. త్రినాథ, కె.రామారావు, ఎస్.బి పోతురాజు, తదితరులు పాల్గొన్నారు.
*మలేరియా రహిత జిల్లా మార్చాలి.*
పాడేరు జిల్లా ఆసుపత్రి విజిట్ లో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు.
*మలేరియా రహిత జిల్లా గా మార్చాలని సి.పి ఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు కోరారు.*
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో వి.శ్రీనివాస రావు తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక నాదం, జిల్లా కార్యదర్శి పి అప్పల నరస, జిల్లా నాయకులు కె. సురేంద్ర, అనంత గిరి zptc డి. గంగా రాజు తో కలిసి పర్యటన చేశారు.రోగులను అడిగి మందులు సరఫరా, ఆసుపత్రి లో సౌకర్యం,వైద్యం అందుతున్న తీరు గూర్చి అడిగి తెలుసుకున్నారు. మలేరియా రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మలేరియా రహిత జిల్లా గా మార్చే అవకాశం ఉన్న ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేయడం లేదని అన్నారు. హై రిస్కు గ్రామాలుగా గుర్తించ గ్రామాల్లో మలేరియా మందులు సరిగా పిచికారి చేయాక పోవడం వల్ల మలేరియా పెరిగిందని అన్నారు. దోమతెరలు వినియోగం తో పాటు పారిశుధ్యం పనులు సక్రమంగా చేసి ఉంటే మలేరియా నివారణకు అవకాశంగా ఉండేదని తెలిపారు. జర్వ బాధితులకు ప్రత్యేక గా రక్త పరీక్షలు నిర్వహించాలని, మెడికల్ క్యాంపు నిర్వహణతో మలేరియా నివారణకు అవకాశం ఉందని అన్నారు.ప్రభుత్వ మెడికల్ కళాశాల ను తక్షణమే ప్రారంభించాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవలభించ రాదని అన్నారు. ఆసుపత్రి లో రోగులకు విల్ చైర్ కూడా ప్రభుత్వం అందించకుండా ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు.