అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచింగిపుట్ మండల ఆంధ్ర & ఒడిస్సా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో, 1946 -1955 సంవత్సరం కాలంలో ఏపీ జెన్కో మార్చ్ఖండ్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగిందని నిర్మించే సమయంలో ముంచింగి పుట్ మండల పరిసర ప్రాంతం లో భూమి కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కోసం.
మేము అనగా శ్రీ బిర్ష ముండా ఎస్టీ మ్యూచువల్లీ ఎడిట్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎల్ టి డి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచింగి పుట్ మండలం, సంఘం తరఫున సుమారుగా 20 మంది సభ్యులతో 2019 సంవత్సరం నుండి మాకు ఉద్యోగం కల్పించాలని ప్రజాభిచేస్తా ఉన్నామని అనగా తేదీ 17/0 3 /2023 దిన విజయవాడ విద్యుత్ సౌదా నందు శ్రీ ఏపీ జెన్కో సిఎండి మరియు చైర్మన్ వారికి మగుడు వినిపించుకున్నాము. దానికి జవాబుదారికంగా సిజిఎం వారిచే మే నెల యందు, Lr,No.CGM(adm),Is&ERP)DGM(HR)L&IR/PO-F/26/2020,dtd ,26/05/2023, ద్వారా మార్చ్ఖండ్ SC గారికి 20 మందికి ముంచింగి పుట్టు, మండలం, పరిసర ప్రాంతంలో అర్హత గల నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపినారు.
GO ప్రకారముగా ఆంధ్రప్రదేశ్ వారికి 70% ఒడిస్సా వారికి 30% ఉపాధి కల్పించాలని ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ వారికి 5 మందికి ఒడిశా వారికి 15 మందికి ఉపాధి కల్పించారు. ఇలా జరిగితే ముంచంగి పుట్టు మండలం పరిసర ప్రాంతంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుందని, కావున GO ప్రకారము పరంగా ఆంధ్రప్రదేశ్ వారికి 70% ఓడిస వారికి 30% దానిని న్యాయం జరగాలని కోరుతున్నామని, అలాగే ఆంధ్ర నుంచి నూతనంగా ఉద్యోగంలో తేదీ:-01/10/2023 దిన 5 మంది చేరడం జరిగింది ఆయన తెలిపారు. మాకు ఓనుకుఢిల్లీ సరిహద్దు గ్రామస్తులు ఇప్పటిదాకా మాకు డ్యూటీ చేయకుండా దాడికి పాల్పడుతున్నారని, ఈ విషయం పై మేము అల్లూరి సీతారామరాజు జిల్లా, కలెక్టర్ వారికి ,పాడేరు ITDA పిఓ అధికారి వారికి, మరియు జిల్లా, SP ఆఫీస్, వారికి, మేము చాలా సార్లు ఫిర్యాదు ఇచ్చిన మాకు పరిష్కారాల్ని చూపటం లేదని, ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతూ సుమారు 20, 25 సార్లు తిరుగుతూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. పైన తెలిపిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రం, చర్చించి మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.