హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పంట రుణమాఫీకి సంబంధించి లబ్దిదారుల బ్యాంకు ఖాతా ల్లో జూలై 18న నగదును జమ చేయనుంది తెలం గాణ ప్రభుత్వం.
పంట రుణమాఫీకి సంబం ధించిన మార్గదర్శకాలను జూలై 15న ప్రభుత్వం విడుదల చేసింది. రుణ మాఫీ డబ్బులు విడుదలైన రోజునే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరుపుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతి నిధులు ఈ సంబరాల్లో పాల్గొంటారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్ట కుండా చర్యలు తీసుకో వాలని బ్యాంకర్లకు ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసు కుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.