అమరావతి
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్ సస్పెండయ్యారు. శాంతిపురం మండలం శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో చంద్రబాబు ఇల్లు కట్టేందుకు టిడిపి నేతలు దరఖాస్తు చేశారు. సబ్ డివిజన్ చేసేందుకు హుస్సేన్ రూ.1.80 లక్షలు అడిగారు. ఇటీవల సిఎం కుప్పం టూర్లో టీడీపీ నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఆరా తీసి, కలెక్టర్ విచారణ జరిపించగా నిజమని తేలింది. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు అని సమాచారం.