ఏపీ ఆర్ స్కూల్ లో విద్యార్థులు నాయకులు

శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థులు నాయకుల ఎన్నికలు నిర్వహించిన ప్రిన్సిపల్ మోహన్ రావు. 


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 2024-25 సంవత్సరంనకు గాను విద్యార్థులకు ఎన్నికల నిర్వహించడం జరిగిందనీ ప్రిన్సిపల్ మోహన్ రావు ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ఆసక్తిని దృష్టితో పెట్టుకొని శాస్త్రీయ పద్ధతులు వివిధ విభాగాలను విద్యార్థుల నుండి నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమక్షంలో పోలింగ్ బూత్ లను ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎన్నికల్లో గెలిచిన విద్యార్థుల నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థుల నాయకులకు తగు సూచనలు తెలియజేసినట్లు ప్రిన్సిపల్ మోహన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డబ్ల్యూ ఓ క్రాంతి కుమార్. ప్రధానోపాధ్యాయులు టీ.వీ.ఎం. మోహన్ రావు. వైస్ ప్రిన్సిపల్ కే. శివాజీ. తదితర ఉపాధ్యాయులు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 2024 - 25 విద్యా సంవత్సరంనకు గురుకుల పాఠశాలలో జాయినింగ్ అవ్విన విద్యార్థుల దూర ప్రయాణం చేసి వచ్చారని తల్లిదండ్రులకు తమ పాఠశాల యందు భోజనం ఏర్పాటు చేశారు.