విజయవాడ జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కేంద్ర కార్య లయం లో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా కొండి శెట్టి సురేష్ బాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కొండి శెట్టి సురేష్ బాబు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూజా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అన్నారు. ముప్పైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా జగ్జీవన్ రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి అన్నారు. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్ రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు అని తెలిపారు. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష, అసమానతలు లేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగ్జీవన్ రామ్ దార్శనికతలో రూపుదిద్దుకుందని, స్ఫూర్తిదాత, ఆదర్శనీయుడు, అణగారిన వర్గాల హక్కుల మహానాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడ లో ఒక ప్రకటనలో తెలియజేశారు.