85వ వార్డ్ కొండయ్యవలస కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ లొ జరిగిన సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మన పరిసరాలు ఎలా ఉంచుకోవాలి, వ్యాధులు రాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజల్లో అవగాహనా కార్యక్రమం జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
కొండయ్యవలస సచివాలయం శానిటరీ సెక్రటరీ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లొ 85 వ వార్డ్ తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్, జనసేన నాయకులు బుదిరెడ్డి అప్పారావు, 19 బూత్ ఇంచార్జి వడ్డాది శ్రీనివాసరావు, వీర మహిళా పైడిరత్నం డొక్కా రమేష్, బీజేపీ నాయకులు కోసూరి తాతారావు, ఈశ్వరరావు, బెండి రామకృష్ణ, వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సీతారామయ్య,RP లీలావతి , ANM జయలక్ష్మి, ఆశ వర్కర్ ఈశ్వరి, సూపర్ వైజర్ నాగమణి, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దలు అందరు కలిసి గ్రామస్తులకి అవగాహనా కల్పించారు.