ద్విచక్ర వాహనంపై మృతదేహం తరలింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఐదు కిలోమీటర్లు మేర బైక్ పై తరలించిన సంఘటన అందర్నీ కలిసి వేసింది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి పీహెచ్సీ పరిధిలో చోటుచేసుకుంది. 


రోగులకు ఎటువంటి సేవలు అందించకపోవడం వలన జడ్డంగి పిహెచ్సి పరిధిలో సుమారు 30 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుచున్నారు. జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మిరియాలవీధి గ్రామానికి చెందిన కుంజం అన్నపూర్ణ 60 అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు నిమిత్తం వారి బంధువు సహాయంతో వచ్చి వైద్యసేవలు పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.