నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సిన కొన్ని విషయాలు

కైకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సిన కొన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నాను.

గ్రామాన్ని నడిపించే నాయకుడిని తయారు చేయాలని మేము ఒకడిని నిలబెడితే, మా బలాన్ని ఉపయోగించుకుని అతను మాజీ అధికార పార్టీ మజిల్ డాగ్ గా తయారయ్యి మమ్మల్ని అందరిని మోసం చేసిన స్టోరీ లైన్ ఆసక్తి కలవారు మాత్రమే చదవండి.

-----



*పరిచయం*

ఒక సామాజిక కార్యకర్తగా నాకున్న అనుభవంతో 2020 కోవిడ్ సమయంలో జాన్ పేట యూత్ అసోసియేషన్ ని గ్రామ అభివృద్ధి, విద్య, ఉపాధి కోసం ప్రారంభించాం. అన్ని రంగాల్లో గ్రామం వెనకబడి ఉంది - యూత్ అసోసియేషన్ కేంద్రంగా గ్రామ సమస్యల మీద పోరాడటంతో పాటు జాన్ పేట ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ఎవరి రంగంలో అనుభవాన్ని వారు గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుని మేమంతా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం.

*అసోసియేషన్ ప్రారంభం*

ఒకరు పొలిటికల్ ప్రతినిధిగా, ఒకరు గ్రామానికి ప్రతినిధిగా, ఒకరు పూర్తి కార్య నిర్వహణ చూడాలి, యూత్ అసోసియేషన్ సభ్యులు అందరు అభివృద్ధికి సహకరించాలి అనే ఒప్పందంతో యూత్ అసోసియేషన్ రిజిస్టర్ చేసి కార్యకలాపాలు మొదలయ్యాయి. 

*అభివృద్ధి యత్నాలు*

గ్రామ అభివృద్ధి సమస్యలను గుర్తించి వాటి మీద పోరాటం చేయడం మొదలుపెట్టాం. వచ్చే పది సంవత్సరాల్లో మన గ్రామం ఎలా వుండాలి, మన పిల్లలకు ఆధునిక ప్రపంచాన్ని పరిచయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో మొదలు పెట్టిన ఉద్యమం ఒక్కడి ఈగో వలన ఎలా బలయిందో చదవండి...

2020 నుంచి గ్రామంలో వున్న సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళిక వేసుకుని పని చేస్తున్నాం. దళిత గ్రామ ప్రత్యేక పంచాయతి, చిన్న తరహా పరిశ్రమలు తద్వారా స్వయం ఉపాధి, విజ్ఞాన కేంద్ర నిర్మాణం, కొల్లేరు భూమి సమస్య, గ్రామ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలు అనేకం ముందు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చాం. 

*వక్రపాట్లు*

మేము నిలబెట్టిన పొలిటికల్ ప్రతినిధి, రాజకీయంగా ఎదగటానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తూ గుడ్డిగా నమ్మాము. అతను మెల్లగా గ్రామ అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా విస్మరించి, యూత్ అసోసియేషన్ బలాన్ని ఉపయోగించి అధికార పార్టీ మజిల్ డాగ్ గా మారి సెటిల్మెంట్లు, దందాలు మొదలెట్టాడు. అప్పటికే యూత్ అసోసియేషన్ కుర్రాళ్ళు అతని అరాచకాలు చూడలేక, ఇందులో నుంచి తప్పుకున్నారు.

*విస్పష్టత*

యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలకి అధికార పార్టీ సహకారం కావాలి కాబట్టి అప్పటి వరకు కొన్ని సందర్భాల్లో పూర్తి వివరం తెలియకుండా నేను వున్నది కుడా నిజమే (దానికి నేను తిరిగి చేయాల్సింది చేశాను). 

కొంతకాలం తర్వాత ఇది న్యాయం కాదు, హద్దు మీరుతున్నావు ఇక్కడితో వీటిని ఆపి మన ఒప్పందం అయిన గ్రామ అభివ్రుద్ధిని కుడా పట్టించుకో అని నేను ప్రశ్నించిన సందర్భాల్లో, గ్రామ అభివృద్ధి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు అని, నేను ప్రశ్నిస్తున్నందుకు వాడి ఈగోని, బలుపుని నా మీద ప్రదర్శన చేయం మొదలు పెట్టాడు. 

*పరిస్థితులు*

అప్పటికే సెటిల్మెంట్లు, దందాలు, ఇసుక మాఫియా వలన లక్షలు వెనకేసుకున్నాడు (అతను వాడే బండి ఫైనాన్సు లేకుండా ఫుల్ కాష్ ఇచ్చి కొన్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు). ఇక గ్రామం ఎలా పోతే నాకెందుకు అనుకున్నాడు. పూర్తిగా అరాచకంలోకి దిగిపోయాడు.

*అధికార పార్టీ సహకారం*

అప్పటికే అధికార పార్టీ నాయకులు అతనికి పూర్తి స్వేఛ్చ ఇవ్వడంతో పాటు మా గ్రామంలో ఇంకెవరు నాయకులు లేనట్లు, గత 5 సంవత్సరాల కాలంలో మూడు నామినేటెడ్ పదవులు ఇవ్వడం వలన అతని అరాచకాలకి అడ్డులేకుండా పోయింది. ఇష్టానుసారం కనిపించిన ప్రతి ఒక్కరిని ముంచేస్తూ వెళ్ళాడు.

*ఆధార ప్రతిపాదనలు*

ఇది కాక గ్రామంలో ఏ పని జరగాలన్నా అతని దయా దాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిన పరిస్తితి వచ్చింది. డైరెక్ట్ గా అధికార పార్టీ నాయకుల దగ్గరకు వెళ్ళినా అతని సలహా లేనిదే ఏ పని జరగకుండా చేశాడు. అతని ఈగోని, బలుపుని అంగీకరించిన వారికి మాత్రమే కమీషన్ పద్దతిలో పనులు జరిగేవి.

*మజిల్డాగ్ ప్రభావం*

కైకలూరు మీద పూర్తి అధికారం అతనిదే, ఇంకో మజిల్డాగ్ తో కలిసి పోలీస్ స్టేషన్ మొత్తం ఆక్రమించుకున్నాడు. అందుకే ఎవడిని కొట్టినా, తిట్టినా, చీటింగ్ చేసినా అడిగే ధైర్యం ఎవరు చేయలేకపోయారు.

*యూత్ అసోసియేషన్ పునఃస్థాపన*

అతను నాతో పాటు గ్రామాన్ని మోసం చేశాడు. ఒక్కడి వలన గ్రామం వెనక్కి వెళ్ళకూడదని యూత్ అసోసియేషన్ కార్యకలాపాలను తిరిగి లైన్ లో పెట్టడానికి మొదటగా తప్పుకున్న అసోసియేషన్ సభ్యులతో కలిసి కొత్తగా యూత్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి (అతనితో యూత్ అసోసియేషన్ కి సంబంధం లేదు అనే ఒప్పందంతో) ప్రెసిడెంట్ ని మార్చి, గత రెండు సంవత్సరాలుగా అతని నుంచి పూర్తిగా వేరయ్యి నా దారిలో నేను గ్రామ అభివృద్ధి కొరకు పని చేయడం మొదలు పెట్టాను.

*పార్టీ కార్యక్రమాలు*

అప్పటికి కుడా కొన్ని గ్రామ అభివృద్ధి పనులకు అధికార పార్టీ సహకారం కావాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలలో వ్యక్తిగతంగా పాల్గొన్నాను.

అప్పటికి గ్రామానికి ఏ పనీ జరగకుండా అడ్డు పడ్డాడు, దీనికి సాక్ష్యం యూత్ అసోసియేషన్ ద్వారా గ్రామ అభివృద్ధి కోసం ప్రారంభించిన అన్ని పనులను కుట్రతో అడ్డుకోవడం.

అతను అభివృద్ధి చెందడం ఇక్కడ ఎవరికీ సమస్య కాదు, కానీ అతని స్వార్ధానికి అందరిని తొక్కుతూ, గ్రామాన్ని తొక్కుతూ ఎదిగాడు అదే సమస్య.

ఎలక్షన్స్ కొంత కాలం ముందు గ్రామ పెద్దలు, యువకులు అందరు కలిసి అప్పటి అధికార పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లి అతను మా గ్రామాన్ని మోసం చేశాడు అతని ఈగో కోసం అందరిని బాదితులను చేశాడు ఇక మీదట మా గ్రామం విషయంలో అతనిని involve చేయకండి అని చెప్పింది అందుకే.

*సత్యాలు*

ఇవన్నీ మాతో ప్రయాణం చేసిన అందరికి తెలిసిన విషయాలే కానీ నిజాలు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. దందాలు చేసింది అతను, సెటిల్మెంట్లు చేసింది అతను, రౌడీయిజం చేసింది అతను, వీటి ద్వారా పదేళ్ళు ఇంట్లో కుర్చుని తిన్నా చాలేంత సంపాదించింది అతను, మమ్మల్ని కుడా బాదితుల్ని చేసి మా గ్రామాన్ని మోసం చేసింది అతను, ఇన్ని చేసిన అతను బాగానే వున్నాడు అతనిని ఏమి చేయలేక సంబంధం లేని మా పైన నిందలు మోపుతున్నారు,

ఒక్కడి ఈగో వలన గ్రామం మొత్తం ఎందుకు నిందలు మోయాలి? సంబంధం లేని మేమెందుకు భాద్యత వహించాలి? న్యాయం ఆలోచించండి.

ఇవేమీ నేను చేస్తున్న ఆరోపణలు కాదు, త్వరలోనే పూర్తి ఆధారాలతో వీలుంటే ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులకి ఆధారాలు ఇస్తాను, లేకపోతే ఇదే వేదిక మీద అందరికి అన్ని ఆధారాలు షేర్ చేస్తాను.

- సశేషం

🙏 సామాజిక ఉద్యమాభివందనాలు 🙏

~ విజయ్ వంగలపూడి

మానవ హక్కుల కార్యకర్త 

జాన్ పేట, కైకలూరు.

PH: 9492739099

FB: https://www.facebook.com/VangalapudiVijay