అరకువేలిలో గిరిజనేతరుడి దురాక్రమణ... దౌర్జన్యం... కబ్జా..

మొస్య ప్రేమ్ కుమార్. S/O బలబద్రుడు (లేటు), 

మాలసింగారం గ్రామం. చినలబుడు పంచాయతీ.

అరకువేలి మండలం. అల్లూరి సీతారామరాజు జిల్లా.!


విషయం;- అరకువేలిలో గిరిజనేతరుడి (దురాక్రమణలో) దౌర్జన్యంతో కబ్జాలో ఉన్న ఐటీడీఏ సాప్ ను గతంలో నాకు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నందున ఆదివాసి నిరుద్యోగినైన నాకు తిరిగి ఆ షాప్ ను ఇప్పించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి నాకు న్యాయం చేయు నిమిత్తం.


అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం చినలబుడు పంచాయతీ మాలసింగారం గ్రామానికి చెందిన మొస్య ప్రేమ్ కుమార్. S/O బలబద్రుడు (లేటు), నేను ఆదివాసి (ఎస్టీ వాల్మీకి) కులానికి చెందిన నిరుద్యోగిని, నాకు గతంలో 2016వ సంవత్సరంలో ట్రైకర్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించు నిమిత్తం అప్పటి గౌరవనీయ (శ్రీ ఎం హరి నారాయణ ఐఏఎస్ ప్రాజెక్టు అధికారి వారు) ప్రత్యేక చొరవతో అరకువేలి మండలంలో గల యండపల్లి వలస గ్రామంలో ఉన్న ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ లో నాకు నాలుగవ (04)వ నంబర్ షాపును కేటాయించి, నెలకు 500/- రూపాయలు రెంటు చెల్లించాలని సూచించి నాకు ఆ (04)వ నంబర్ షాపును మంజూరు చేస్తూ తేదీ:- 27 మార్చి 2016న RC నెంబర్ 164/2008/A6 ద్వారా ఉత్తర్వులు జారీ చేసి, నేను ట్రైకార్ ద్వారా నేను ఆ షాప్ లో స్వయం ఉపాధిని చేసుకొనుటకు నాకు అవకాశాలు కల్పించి ఉన్నారు, అప్పుడే నేను దానికి సంబంధించిన కొంత రుసుమును ఐటీడీఏ వారికి డిడి ల రూపంలో చెల్లించి ఉన్నాను, ప్రస్తుతం ఆ షాప్ నిమిత్తం పెండింగ్ లో ఉన్న రెంటు బకాయిలను పూర్తిగా చెల్లించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.


అయితే ఆ షాపింగ్ కాంప్లెక్స్ గతంలో నిర్మించి ఎక్కువ కాలం కావడంతో శిధిలావస్థ దశకు చేరుకున్నపరిస్ధితుల్లో ఆ షాపుల పై పెచ్చులు ఊడిపోవడం వర్షాకాలంలో వర్షపు నీళ్లు కారిపోవడం జరుగుతున్నందున నేను నాతో పాటు మిగిలిన షాపుల వారు కొంతకాలం వినియోగించడం నిలిపివేయడం జరిగినది.


కొద్దికాలంగా నా ఆరోగ్య పరిస్థితులు బాగులేనందున నేను గ్రామంలో లేని సమయంలో నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా నాకు ఏమాత్రం సంప్రదింపులు జరపకుండా అక్రమంగా తాళాలు విరగగొట్టి లంక నాగరాజు S/O రామ కృష్ణ, ఫోన్ నెంబర్ 8985646859. అనే గిరిజనేతరుడు నాకు మంజూరు చేసి ఉన్న నాలుగవ (04)వ నంబర్ షాపును అలాగే దాని పక్కన ఉన్న ప్రభుత్వ కాలి స్థలాన్ని దౌర్జన్యంగా అక్రమంగా పూర్తిగా కబ్జా చేసి బైక్ మెకానిక్ మరియు స్టిక్కరింగ్ షాపు గా మార్చి, గత ఏడాది కాలంగా తన అధీన అనుభవంలో ఉంచుకొని వారు వాడుకోవడం జరుగుచున్నది.

నేను అతనిని అడుగగా బినామిపేరున పోర్జరి చేసిన కాగితాలు చూపిస్తూ అధికారులను తప్పుదోవపట్టిస్తూ నాతో అతను వాగ్వాదానికి దిగడం జరుగుతున్నది, అందుకు ఆదివాసి నిరుద్యోగినైన నేను పూర్తిగా ఉపాధి అవకాశాలను కోల్పోయి ఉన్నాను (దాని ద్వారానే తప్ప ఏ ఇతర ఉపాధి అవకాశాలు ఏమీ నాకు లేదు). 


అధికారుల సమక్షంలో వాస్త వాస్తవాలను న్యాయ విచారణ జరిపించి ఉపాధిని కోల్పోయిన నాకు ఆ షాప్ ను తిరిగి ఇప్పించి నేను మరల స్వయం ఉపాధిని చేసుకొనుటకు నాకు అవకాశం కల్పించి నాకు న్యాయం చేయాలి.