గంజాయి కేసులను సమీక్షించిన: జిల్లా ఎస్పీ కె.వి.మురళీ కృష్ణ ఐపీఎస్.

 అనకాపల్లి జిల్లా

గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ



గంజాయి అక్రమ రవాణా ఇతర డ్రగ్స్ నివారణకు 100 రోజుల ప్రత్యేక కార్యచరణ లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో గంజాయి కేసులను సమీక్షించి దర్యాప్తు అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.ఆంధ్ర ఒడిషా బోర్డర్ ఏజన్సీ ప్రాంతం నుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులను సమీక్షించి దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దర్యాప్తు అధికారులు గంజాయి కేసులను ప్రత్యేక శ్రద్ధ వహించి నేరాభియోగ పత్రాలను సంబంధిత కోర్టులో నమోదు చేయాలని, కేసులలో పురోగతిపై పి.పి తో అనుసంధానంతో సదరు కేసులలో శిక్షలు పడేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్. అప్పలరాజు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, ఇన్స్పెక్టర్ లు లక్ష్మణ్ మూర్తి, గణేష్, కుమారస్వామి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.