శ్రీకాకుళం జిల్లా పోలీసు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, ఐపిఎస్ ప్రజలు నుంచి పిర్యాదులు స్వీకరించి,వారితో ముఖా ముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు. జిల్లా ఎస్పీ తోపాటు అదనపు ఎస్పిలు జి. ప్రేమ్ కాజల్ వి.ఉమా మహేశ్వర రావు బాధితుల వద్ద నుండి ఫిర్యాదుల స్వీకరించారు.