వంతెన కావాలి మహాప్రభో...



వంజరి 2 మర్రిపాలెం గ్రామంలో సుమారు 60 సంవత్సరాలు నుంచి నివాసం ఉంటున్నారు, గ్రామం నుండి బయటకు రావాలంటే వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఒక్క బ్రిడ్జి నిర్మించే నాథుడే కరువయ్యారు. 



ఏ ప్రభుత్వం కూడా మాకు జాలి చూపించట్లేదు అందుకు మా పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఈ వంతెన దాటి వెళ్లాలి. గతంలో శ్రీమతి గిడ్డిశ్వరి వచ్చారు గత వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రిమతీ భాగ్యలక్ష్మి కూడా వచ్చారు ఎమ్మెల్యే మేడం తో మా బాధలు చెప్పుకున్నాం కానీ గ్రామం పై జాలి చూపించలేదు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ వార్త చూసిన తదుపరి గ్రూపులో ఉన్న నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఇటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలరని మర్రిపాలెం గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.