రాత్రిపూట ఇంటి నేరములలో ముద్దాయి అరెస్ట్

POLICE, PRO EAST GODAVARI DISTRICT.

పలు రాత్రిపూట ఇంటి నేరములలో ముద్దాయి అరెస్ట్.


212 గ్రాముల బంగారు ఆభరణాలు, 125 తులాల వెండి, 90 వేలు నగదు మరియు ఒక మోటార్ సైకిల్ రికవరీ.

ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దృష్టి సారిస్తున్నాం.

పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాం... తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పీ. జగదీష్ ఐ.పీ.ఎస్., గారు.

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు డి.ఎస్.పి (ఈస్ట్ జోన్) శ్రీ ఎం. కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ (బొమ్మూరు) శ్రీ ఎండి. ఉమర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముద్దాయి కోసం గాలించి, అరెస్టు చేసి, చోరీ సొత్తును రికవరీ చేసి, ఈరోజు ముద్దాయిని రిమాండ్ కు పంపించడం జరిగింది.

నేరం జరిగిన తేది, సమయం మరియు స్టలము

22-9-2023 in-between 05-00 pm to 8-00 pm at Satyanrayananagar, Kotahapeta, Patha Bommuru, Bommuru Village, Rajamahendravaram Rural.



ముద్దాయి యొక్క వివరములు:

కొండేటి సాయి s/o రాంబాబు, వయస్సు-25, కులం-గౌడ, r/o D.No. 9-880/1, కుబేర అపార్ట్మెంట్స్ , ZP హై స్కూల్ రోడ్, కొంతమూరు గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ 

ముద్దాయి వృత్తీ, 

గత నేరములు వాటి వివరములు.

Cr.No.251/2019 u/s 457,380 IPC of Rajanagaram PS

Cr.No.200/2020 u/s 457,380 IPC of Rajanagaram PS

Cr . No . 242/2023, U/S 457, 380 IPC of Bommuru Police Station

Cr . No . 278/2023, U/S 457, 380 IPC of Bommuru Police Station

Cr . No . 310 /2023, U/S 454 , 380 IPC of Bommuru Police Station

Cr . No . 311/2023, U/S 454 , 380 IPC of Bommuru Police Station

Cr . No . 115 /2024 , U/S 457 , 380 IPC of Bommuru Police Station

Cr . No . 231/2024 , U/S 457 , 380 IPC of Bommuru Police Station

Property Recovered:

బంగారు వస్తువుల వివరాలు.

1) నల్లపూసల దండ-1, తూకం-15.740 గ్రాములు,

 2) వేంకటేశ్వర స్వామి లాకెట్ ఉన్న గొలుసు -1 తూకం-16 .900 

3) బంగారపు నల్లపూసల దండ-1, తూకం-24 .00 గ్రాములు, 

4) బంగారపు ఛైను-1, తూకం-16 .190 గ్రాములు, 

5) బంగారపు గోవిందరాజు స్వామి రింగ్ చిన్నది-1 తూకం-4.00 గ్రాములు, 

6) బంగారపు సాయిబాబా బొమ్మ ఉన్న చిన్న రింగ్ -1 తూకం-4.500 గ్రాములు, 

7) బంగారపు వేంకటేశ్వర స్వామి పెద్ద రింగ్-1 తూకం-7.900 గ్రాములు, 8) బంగారపు గోవిందరాజుస్వామి పెద్ద రింగ్-1 తూకం-7.930 గ్రాములుగా 

9) బంగారపు నల్లపూసల దండ-1 తూకం-15.840 గ్రాములు, 

10) బంగారపు ఛైను-1 తూకం-15.00 గ్రాములు, 

11) బంగారపు చెవి దీద్ధులు -2 జతలు(సాదా దిద్ధులు, రాళ్ళ దిద్ధులు) తూకం-5.500 గ్రాములు, 

12) బంగారపు ఉంగరాలు -3 (గణపతి, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవి అమ్మవారు ) తూకం-14.300 గ్రాములు 

13) బంగారపు హారము-1 తూకం-31 .400 గ్రాములు, 

14) బంగారపు నానతాడు-1 తూకం-16.600 గ్రాములు, 

15) బంగారపు మూడు రాళ్ళతో ఉన్న చెవి దిద్దులు, మాటీలు-1 జత తూకం-5.500 గ్రాములు, 

16) బంగారపు తెల్ల రాళ్ళతో ఉన్న చెవి దిద్దులు, మాటీలు-1 జత తూకం-8.200 గ్రాములు, 

17) బంగారపు సాయి బాబా ఉంగరం-1 తూకం-2 .00 గ్రాములు 


మొత్తం బంగారపు వస్తువులు తూకం 212 గ్రాములు విలువ సుమారు 13,14,400/- రూపాయలు.

వెండి వస్తువుల వివరములు.

1) వెండి ప్లేటు -1 తూకం-59.00 గ్రాములు, 

2) వెండి చెంబు-1 తూకం-137.00 గ్రాములు, 

3) వెండి సాయిబాబా బొమ్మ-1 తూకం-24.00 గ్రాములు 

4) వెండి లక్ష్మీ దేవి బొమ్మ-1 తూకం-15.00 గ్రాములు, 

5) వెండి నెమలి కుంకుమ బరిణ-1 తూకం-87.00 గ్రాములు, 

6) వెండి చిన్న పంచపాత్ర-1 తూకం-24.00 గ్రాములు, 

7) వెండి దీపపు కుందులు-2 తూకం-41.00 గ్రాములు, 

8) వెండి నాలుగు గిన్నెలు కలసిన పసుపు,కుంకుమ, అక్షింతల గుత్తి -1 తూకం-46.00

9) వెండి ప్లేట్ -1 తూకం-307 గ్రాములు, 

10) వెండి ప్లేట్ చిన్నది -1 తూకం-103.00 గ్రాములు 

11) వెండి గ్లాసులు-4 తూకం-117.500 గ్రాములు, 

12) వెండి దీపపు కుందులు- ఒక జత పెద్దవి తూకం-57.00 గ్రాములు, 

13) వెండి దీపపు కుందులు- ఒక జత చిన్నవి తూకం-36 .00 గ్రాములు. 14) వెండి ఆగరవత్తుల స్టాండు పెద్దది -1 తూకం-35 .00 గ్రాములు, 

15) వెండి ఆగరవత్తుల స్టాండు చిన్నది -1 తూకం-12 .00 గ్రాములు 

16) వెండి గంట చిన్నది-1, తూకం-62 .500 గ్రాములుగా

17) వెండి అస్థలక్ష్మి చెంబు పెద్దది-1 తూకం-173 .00 గ్రాములు, 

18) వెండి దీపపు కుందులు – ఒక జత తూకం-63 .00 గ్రాములు, 

19) వెండి పట్టీలు కొత్తవి 1 జత తూకం-76 .00 గ్రాములు,

20) వెండి ఛైను-1 తూకం-12 .00 గ్రాములు.

మొత్తం వెండి వస్తువుల తూకం 1.500 Kgs, విలువ సుమారు 1,35,000/- రూపాయలు.

Cash:90,000/-.

నేరం జరిగిన విషయం:

పై కేసులో నేరస్తుడు అయిన కొండేటి సాయి s/o రాంబాబు 10 వ తరగతి వరకు చదువుకొని మానివేశి, తన తండ్రి అయిన కొండేటి రాంబాబు 2 సం. ల క్రితం కరోనాతో చనిపోయారు. సాయి తండ్రి కూడా గతములో చోరీలు చేసేవాడు . అలా సాయి తండ్రి దొంగతనాలు చేయడము చూసిన సాయి కూడా చోరీలు చేయడము అలవాటు అయ్యింది. సాయి చదువు మానేసిన తరువాత కొన్నాళ్ళు మిల్క్ డైరీలోను, Flip cart నందు పనిచేసి మరియు ప్రైవేటు ఉద్యోగము చేయుట వలన వచ్చే జీతం సాయి ఖర్చులకు సరిపోక మరియు సాయి వున్న చెడు వ్యసనములు అయిన మద్యం త్రాగటం, అమ్మాయిలతో తిరిగే అలవాట్లు డబ్బులు అవసరం అయి సాయి నేరాలు చేయడానికి బాగా అలవాటు పడ్డాడు. సాయి గతం లో 2017 సం.ము నుండి చిన్న,చిన్న దొంగతనాలు చేసి రాజానగరం PS నందు 2 చోరీ కేసులు, అంబాజీపేట పోలీసు స్టేషన్ నందు బైన్డ్ఓవర్ కేసు, సామర్లకోట PS నందు ఒక Bindover కేసు, సికింద్రాబాద్ రైల్వే నందు ఒక చోరీకేసు ఉన్నాయి. ప్రస్తుతం సాయి కి ఏ పని లేక, గత సంవత్సరం అనగా 2023 జూలై నెల నుండి ఈ సంవత్సరం అనగా 2024 జూన్ నెల మద్య కాలములో సాయి సుమారు 6 దొంగతనాలు చేసినాడు.


పై కేసులలో మొత్తంగా బంగారపు recovery 212 గ్రాములు విలువ 13,14,400/- రూపాయలు, వెండి recovery 1.500 Kgs, విలువ 1,35,000/- రూపాయలు, Cash:90,000/- ఒక మోటార్ సైకిల్ ని సాయి దగ్గర నుంచి స్వాదీనపరచుకోవడమైనది. 


దర్యాప్తు చేసిన అధికారులు మరియు సిబ్బంది వివరములు.

CI- MD.UMAR OF BOMMURU POLICE STATION

SUB-INSPECTORS OF POLICE

B SRINU OF BOMMURU PS (SI)

R ANKA RAO OF BOMMURU PS (SI)

ASI- 1374 A K SATYANARAYANA

HC’S- HC-2903 P.VENKATESWARA RAO OF BOMMURU PS

PC’S- PC-2239 K.SURESH BABU OF BOMMURU PS. మరియు క్రైమ్ సిబ్బంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరు వెళితే నగదు, విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవద్దని, బ్యాంక్ లాకర్ లో ఉంచుకోవాలని, ఊరి వెళ్ళేటప్పుడు పోలిస్ లకు సమాచారం ఇస్తే ఎల్. హెచ్. ఎం.ఎస్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించబడుతుందని అన్నారు. 

పై కేసులో ముద్దాయిని పట్టుకొని చోరీ సొత్తు రికవరీ చేసినందుకుగాను అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు వారిని ప్రత్యేకంగా అభినందించారు.