అనకాపల్లి జిల్లా
అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీ సాలాపు శాంతి సూర్య అప్పారావు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ సూచనల మేరకు నూకాంబిక అమ్మవారి గుడి దగ్గర నుంచి గ్రామ సచివాలయం ప్రక్క నుండి ఉన్న ప్రధాన డ్రైనేజీ పూడికను జెసిబి ట్రాక్టర్ల సహాయంతో పూడిక తీసివేసి బయటకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో పారిశుద్ధ్యనికి నోచుకోని తమ ఊరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి రోజులు వచ్చాయని పారిశుద్ధ్యనికి శ్రీకారం చుట్టిన శాంతి సూర్య అప్పారావు కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.