గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడు మృతి...

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో సీనియర్ పాత్రికేయుడుగా విజన్ దినపత్రికలో పనిచేస్తున్న సాగిరాజు నాగేష్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక గుండెపోటుతో ఆయన స్వగృహంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 



రాజేంద్రపాలెంలో నివాసం ఉంటున్న నాగేష్ గతంలో2008 నుండి ప్రముఖ దినపత్రికలో పనిచేసేవారు. అనంతరం 2010 నుండి విజన్ దినపత్రికలో పనిచేస్తున్నారు. పాత్రికేయుడుగా ప్రజలతో, అధికారులతో స్నేహ స్వభావం కల వ్యక్తి. ఎవరితోటి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నిలిచిన వ్యక్తి అని వివిధ రాజకీయ పార్టీ నాయకులు అధికారులు కొనియాడారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి తమ కళ్ళముందు లేడని వార్తను పాత్రికేయులతో పాటు మండల స్థాయి అధికారులు రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలో నగేష్ మృతి పట్ల పలువురు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు తమ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తను ఎంతో ప్రేమగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువు కూడా అందరికీ కళ్ళెంట నీళ్లు వచ్చేలా ప్రవర్తించింది తను పెంచిన యజమాని లేడని జిర్ణించుకోలేక తన దగ్గరికి తీసుకు వచ్చిన ఆ పెంపుడు జంతువు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన చూసిన అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.