అల్లూరి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన అరుకు ఎంపీ డా గుమ్మ తనూజరాణి

అల్లూరి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన అరుకు ఎంపీ డా గుమ్మ తనూజరాణి.



అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. ముఖ్యఅతిథిగా హాజరై అల్లూరి జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ పాడేరు అరకు ఎమ్మెల్యేలతో పాటు కలసి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన గిరిజన ముద్దుబిడ్డ అరకు పార్లమెంట్ సభ్యురాలు ఎంపి డా గుమ్మ తనూజరాణి.



అనంతరం ఏర్పాటు చేసిన అల్లూరి జయంతి వేడుకలో అరుకు ఎంపీ గారు మాట్లాడుతు వీరత్వం పౌరుషానికి ప్రాణం పోస్తే కనిపించే రూపం అల్లూరి తెల్ల దొరల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి అహింస పోరాటానికి ఆధ్యుడిగా గాంధీజీని చెప్పుకుంటే సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మి తన జీవితాన్నే అర్పించిన ధీరుడు మన్యం వీరుడు ఆంగ్లయుల దోపిడీకి గురైన అమాయక గిరిజనుల్లో విప్లవాగ్ని రగిలించి తెల్ల దొరల గుండెల్లో మరఫిరంగిగా మారి తెలుగు నేలపై విప్లవ బీజాలు నాటిన ఆ మహనీయుడు వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రమబేరి అని తెలుపుతూ 



ఆయన నడియాడిన మన్య ప్రాంతాన్ని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి  మన ప్రభుత్వ హయాంలో అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఒక గిరిజన బిడ్డగా గర్వపడుతున్నానని ఆయన ఆశయ సాధన అడుగుజాడలలో యువత నడుచుకోవాలని పిలుపునిచ్చిన అరకు పార్లమెంట్ సభ్యురాలు డా గుమ్మ తనూజరాణి.



అల్లూరి జయంతి వేడుక కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరుకు నియోజకవర్గం శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పిఓఅభిషేక్, పాడేరు సబ్ కలెక్టర్ అధికారి ధాత్రి రెడ్డి, పాడేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి, మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థినీవిద్యార్థులు అనేకమంది పాల్గొన్నారు