నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రివర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొనేదెల పవన్ కళ్యాణ్ మరియు ఆరోగ్య శాఖ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా శుభాకాంక్షలు అభినందనలు కూటమి ప్రభుత్వానికి అభినందనలు శుభాకాంక్షలు హృదయ పూర్వక నమస్కారులు తెలుపుతు జాతీయ అర్ ఎస్ పి / పి ఎం పి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడ.
కూటమి ప్రభుత్వానికి ప్రజలు మీకు ఇచ్చిన ఘన విజయాన్ని, ప్రజలు మీపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి మీ విజయం ప్రతిబింభం ప్రజల కలలను సాకారం చేయడంలో మీ పూర్తి పదవీకాలంతో పూర్తి చేయాలని బలమైన, ప్రకాశవంతమైన భారతదేశాన్ని / రాష్ట్రాన్ని నిర్మించడంలో మీరు ఈ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము . భారత దేశం కి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు నేటికీ శాస్వత పరిష్కారం కాలేదన్నారు. రాష్ర్ట/ కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రామాలలో, పట్టణాలలో, మురికివాడల్లో నివసించు పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యులకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. భారతదేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన అరోగ్య ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి వర్యులు గా భాద్యతలు స్వీకరించిన సందర్బంగా ప్రత్యేక చొరవ చూపి గ్రామీణ వైద్యుల సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపాలని వివరించారు. వృత్తి భద్రత కల్పించాలన్నారు. సబ్సిడీతో రుణాలు, ఉచిత బస్సు పాసులు, ఉచిత ఇల్లు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రామీణ వైద్యుల కు ప్రాధాన్యత కల్పించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన జీ వో నో 429 నిలిచిపోయిన పారా మెడిక్స్ శిక్షణను తిరిగి ప్రారంభించి గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించి అర్హత సర్టిఫికెట్లు మంజూరు చేయాలన్నారు. అర్హత సర్టిఫికెట్ల ఆధారంగా గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్సలు చేయుటకు అనుమతులు మంజూరు చేయాలని నూతన అరోగ్య, ఫ్యామిలీ మంత్రిగా రాష్ట్రం లో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక సమగ్రమైన చట్టాన్ని ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారన్న భరోసా తో వున్నాము త్వరలోనే గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నాము. జాతీయ ఆర్ ఎమ్ పి / పీ ఎమ్ పి సంఘాల సమాఖ్య అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు, రాష్ట్ర కమిటీ నాయకులు షైక్ వలి సహబ్ ఎమ్ పాపన్న, పువ్వుల జనార్థన్ శ్రీనివాస్, అర్ ఎస్ నాయుడు, సురేష్ విజయవాడ 9885395466.