విశాఖ మెడిసి హాస్పిటల్ సైంటిఫిక్ మీట్ కు విచ్చేసిన పలువురు ప్రముఖులు...

మెడీసీ హాస్పిటల్ విశాఖపట్నం వారు నిర్వహించు సైంటిఫిక్ మీట్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెడిసి హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ బి శిరీష రాణి గైనిక్ సర్జన్ డాక్టర్ బి జ్యోతిర్మయి గైనిక్ సర్జెన్ డాక్టర్ ఎం గౌతమి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ గాస్ట్రో సర్జన్ జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు మరియు రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ నాయుడు తదితర నాయకులు విశాఖపట్నం జిల్లా నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.


ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ మెడీసి హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని ఇలాంటి సమావేశంలో ఉన్న విజ్ఞానాన్ని ప్రథమ చికిత్స చేయు విధానాన్ని అవగాహన ఏర్పడుతుందని ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనంద దాయకమని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పిలిచిన యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేస్తూ జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేయు చున్నాను అని విశాఖపట్నం లో జిల్లా కమిటీలు ఏరియా కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సభ్యులకు ఆహ్వానం పలుకు తున్న దని ఎలాంటి సమస్యలున్న సభ్యులకు వున్నా అండదండగా ఉంటానని గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేస్తామని అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అధికారులను గ్రామీణ వైద్యుల సమస్యల కోసం నిరంతరం పోరాడు చేయు చున్నా మని కూటమి ప్రభుత్వ మంత్రివర్యులకు గ్రామీణ వైద్యుల సమస్యలు విన్నవించడం జరిగిందని త్వరలో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు విశాఖపట్నంలో ఒక ప్రకటనలో తెలియజేశారు.