శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ ను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశం లో జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపీఎస్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఐఏఎస్, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ సమావేశం నిర్వహించి అధికారులు అందరు అంకిత భావంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు.