ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన పాడేరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గిడ్డి ఈశ్వరి

అల్లూరు జిల్లా




అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రడు నివాసం నర్సీపట్నం లో మర్యాద పూర్వకంగా కలిసిన గిడ్డి ఈశ్వరి, పార్టీ నాయకులు అల్లూరి జిల్లా సమస్యలు చెప్పుకున్నారు.పాడేరు నియోజకవర్గం లో మండలాలు గ్రామాలలో వున్న సమస్యలు కొరకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన పాత్రడు తో చర్చించడం జరిగింది. అయితే ఈ సందర్బంగా కొయ్యురు మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు మాట్లాడుతూ మా ఈశ్వరమ్మ అడుగు జాడలో నడుచు కుంటాం అని పార్టీ కోసం ప్రజల కోసం కస్టపడి పనిచేస్తాం అంటూ కొయ్యురు మండలం చుట్టు ప్రక్కల వున్న ప్రజలు సమస్యలు మాకు తెలిస్తే వెంటనే స్పందిస్తు సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని కొయ్యురు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జ్ తోట దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా మేడిబోయిన సత్తిబాబు,జిల్లకర్ర శ్రీను,నల్లగొండ యూనిట్ ఇంచార్జి లోతా సింహా చలం,బూత్ కన్వీనర్ పాంగి బీమరాజు,రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ పాల్గొన్నారు.