ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి, వైసీపీ నాయకుడు అరికట్ట ఆంజనేయులు..


అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిమండలం లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు జీకే వీధి మండల యువ నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, పొంగిపొర్లతు ఉన్నాయని, ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కోరారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు. కాచి చల్లార్చిన వేడి నీటిని తాగాలని, మీరు కలుషితమై మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వృద్ధులు చిన్నారులు వికలాంగులు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, పిల్లలను పాఠశాలలకు పంపించే సమయాలలో వాగులు దాటించే సమయం లో పిల్లలను వెంట ఉండి జాగ్రత్త వహించి వాగులు దాటించాలని కోరారు.