అల్లూరి జిల్లా
స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈనెల తేదీ 10/07/24 బుధవారం పాడేరు నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంలో ఉదయం 10:30 గంటలకు పాల్గొనున్నారని, సమీక్ష సమావేశం అనంతరం భోజన విరామం తర్వాత 1:30 నిముసములకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారని, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు కార్యకర్తలు అభిమానులు బుధవారం 11:30 నిమిషములకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నివాసానికి తప్పక హాజరు కావలసిందిగా కోరారు.