అమరావతి
మాజీ సీఎం జగన్కు సర్కార్ షాకిచ్చింది.పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబుఆదేశించారు. గత ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డిరాంగోపాల్రెడ్డి సీఎంకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు.