పల్లా ను కలిసిన పలువురు మండల జిల్లా స్థాయి నాయకులు



ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనువాసరావు ని మర్యాద పూర్వకంగా ఈరోజు పాడేరు నియోజకవర్గ ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు మహిళలు కలవడం జరిగింది. 



పాడేరు నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు అలాగే కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి సమస్యలు గురించి వినతిపత్రం అధ్యక్షులు వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు రోడ్డు మధ్యలో కాలువ రెండు బ్రిడ్జిల కోసం వివరించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి తోట దొరబాబు, సీనియర్ నాయకుడు మేడిబోయిన సత్తిబాబు, మహిళా నాయకులు బోణంగి సత్యవతి,  గరెంగి రాజేశ్వరి,  తోకల దేవి, యూనిట్ ఇంచార్జి లోతా సింహాచలం,  పల్లి అప్పారావు,  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.