అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, జర్రెల పంచాయితీ, కొండ్రుపల్లి ఘాటి రోడ్డు లో ఆటో బోల్తా పడింది.
గిల్లగోoది గ్రామానికి చెందిన గిరిజనులు బుధవారం సాయంత్రం చింతపల్లి వస్తుండగా ఘాట్ లో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు గిరిజనులకు గాయాలయ్యాయి. వారిలో కోటేశ్వరరావు అనే గిరిజనుడుకు కాలు విరిగింది. స్థానికులు దగ్గర్లో ఉన్న చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.