ఆదివాసి బిడ్డ భారత రాష్ట్రపతి వారిని నేడు మర్యాదపూర్వకంగా కలిసిన అరకు ఎంపీ డా గుమ్మ తనూజరాణి.

ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసిన అరకు ఎంపి శ్రీమతి డాక్టర్ గుమ్మ తనూజ రాణీ మరియు కుటుంబ సభ్యులు. పలు గిరిజన,మరియు రాష్ట్ర సమస్యలు కొరకు ప్రాతినిధ్యం చేసిన అరకు ఎంపీ. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక చట్టం ద్వారా అయిన గిరిజన ప్రాంతం లో ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనుల కే కేటాయించాలి అని విజ్ఞప్తి చేసారు. 


కర్ణుడికి కవచ కుండలు ఎంత ముఖ్యమో గిరిజన ప్రాంతానికి జీవోనంబర్ 3 అత్యంత అవసరం అని వివరించిన అరకు ఎంపి, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ పండించే మా గిరిజన రైతులకు ఒనగూరుతున్న ప్రయోజనం మాత్రం శూన్యం అని వివరించారు. అరుకు కాఫీ కి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దీనివలన మధ్యవర్తులు దళారులు లబ్ధి పొందుతున్నారు. కానీ పండించిన రైతు నష్టపోతున్నాడు కనుక ఒక గిరిజన కాఫీ సొసైటీ స్థాపించి ఉద్యోగ నియామకాలు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయించి సొసైటీ ద్వారా కాఫీ కొనుగులు చేపడితే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ యువత కు ఉపాధి కల్పించినట్లు కూడ అవుతుంది అని రాష్ట్రపతి కి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని వైసిపి పార్టీ సానుభూతిపరులు, నాయకులు కార్యకర్తలు పై భౌతిక దాడులు ఆస్తుల విద్వంసలతో రాష్ట్రం లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి అని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అని ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది అని ఎంపీ రాష్ట్రపతి కి వివరించారు కాబట్టి పరిస్థితి ని అదుపులోకి తేవలసినదిగా భారత రాష్ట్రపతి కి కోరారు. సుమారు 15 నిమిషాలు సమయం కేటాయించిన రాష్ట్రపతి అరకు ఎంపీ చెప్పిన అంశాలు అన్ని ఆసక్తి గా ఆలకించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి నివేదికలు తక్షణమే సిద్ధం చేయమని రాష్ట్ర పతి భవన్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే సంబధిత మంత్రిత్వ శాఖలకు తను ఆదేశాలు ఇస్తాను మీరు కూడా ఒకసారి మంత్రులతో మాటాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయమని చెబుతూ చిన్న వయసులో ప్రజాసేవ చేసే అదృష్టం మీకు వచ్చింది కస్టపడి ప్రజాసేవ చేసి ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవాలి అని అభినందించి అరుకు పార్లమెంట్ సభ్యురాలు ఎంపి డా గుమ్మ తనూజరాణి ఆశీర్వదించారు.