మానవత్వం చాటుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర్ రాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో అమ్మవారి పాదాలు ఘటి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో అదే మార్గమధ్యంలో వెళుతున్న పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆటో ప్రమాధం చూసి హుటాహుటిన వెళ్లి గాయాలపాలైన వారికి ఎమ్మెల్యే  మరియు తన సహాయక సిబ్బంది తో స్వయంగా చేతనా పట్టుకుని హాస్పిటల్ లో చేర్పించి మానవత్వం చాటుకున్నరు. 



ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలో ఉన్న పాడేరు జిల్లా హాస్పిటల్లో దగ్గర ఉండి చేర్పించారు. శాసన సభ్యులు హాస్పిటల్ సిబ్బంది వైద్యులకు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ సమాచారంతో తెలియజేశారు.