అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం వంచుల పంచాయితీ సిరి బాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. శనివారం వీధి దీపాలు అమర్చేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ వైరు తగిలి షాకుకు గురై కింద పడ్డాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్ వి నగర్ పీహెచ్సీకి తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం. చింతపల్లి ఏరియా ఆసుపత్రికి. తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందడు.